సీఐ సుబ్బానాయుడికి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవార
నాదెండ్ల: పల్నాడు జిల్లా పరిధిలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ పోలీసు అధికారిగా చిలకలూరిపేట రూరల్ సీఐ బత్తిన సుబ్బానాయుడు అవార్డు అందుకున్నారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలో నమోదైన కేసుల్లో చురుకై న దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవటం, చోరీ సొత్తు రికవరీ చేయటం, బాధితులకు అప్పగించటంలో చూపిన ప్రతిభకు ఈ అవార్డు దక్కింది. పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డీఎస్పీ నాగేశ్వరరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులతో కలిసి సీఐ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పుర ప్రముఖులు, పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.
జన సందోహం ‘కనుమా’..!
నరసరావుపేట: ప్రజలు గురువారం కనుమ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత వేకువనే పల్లెటూళ్లలో తమ ఇళ్లలోని పశువులకు పసుపు, కుంకుమలతో రంగులు పూసి పూజలు చేశారు. కనుమ నాడు మాంసం తినే సంప్రదాయం ఉండడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. వేట మాంసం, బ్రాయిలర్, నాటు, గిరిరాజా కోడి మాంసాలకు గిరాకీ ఏర్పడింది. నరసరావుపేట పట్టణంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వేట మాంసం కేజీ రూ.900లకుపైగా ధర పలకగా చికెన్ ధర రూ.240పైగా పలికింది. గిరిరాజా కోడి మాంసం ధర రూ.550, నాటుకోడి కేజీ రూ.750 పలికింది.
Comments
Please login to add a commentAdd a comment