ఉన్నతాధికారుల ఆదేశాలతో తగ్గించాం | - | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారుల ఆదేశాలతో తగ్గించాం

Published Mon, Jan 20 2025 1:30 AM | Last Updated on Mon, Jan 20 2025 1:31 AM

ఉన్నతాధికారుల ఆదేశాలతో తగ్గించాం

ఉన్నతాధికారుల ఆదేశాలతో తగ్గించాం

సౌర విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయానికి రెండు గంటలు విద్యుత్‌ సరఫరాను తగ్గించాం. మళ్లీ ఉత్పత్తి పెరిగిన తర్వాత 9 గంటల సరఫరా పునరుద్ధరిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే కోతలు లేకుండా అందించడానికి చర్యలు తీసుకుంటాం.

– ప్రదీప్‌ కుమార్‌, విద్యుత్‌ ఏఈ

ప్రభుత్వం తీరు దారుణం

వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై రెండు గంటలపాటు కోత విధించడం దారుణం. దీంతో పంటలకు నీటి తడులు ఇబ్బంది పడుతున్నాం. అదనంగా ఖర్చు పెరుగుతోంది. జొన్న, మొక్కజొన్న ఎదుగుదల దశలో ఉన్నాయి. ఈ సమయంలో పంటలకు ఎరువులు, నీరు అందించాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాణ్యమైన విద్యుత్‌తో పాటు 9 గంటలు నిరంతరాయంగా సరఫరా చేశారు. కరోనా సమయంలో కూడా ఆటంకాలు లేవు. అప్పడు లేని కోతలు ఇప్పుడు ఎందుకు? కూటమి ప్రభుత్వం వెంటనే 9 గంటలు విద్యుత్‌ ఇవ్వాలి. – మర్రెడ్డి కిషోర్‌రెడ్డి, తూములూరు, రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement