విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ
క్షమాదేశ్‌పాండే
దామెర: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్‌పాండే అన్నారు. మండల కేంద్రం క్రాస్‌వద్ద నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ బాలుర ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతోపాటు తరగతి గదులు, కిచెన్ రూం, టాయిలెట్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆమెతో విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. నీటి కొరతతో బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని, 20 మంది విద్యార్థులు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నీటి సమస్యతో బహిర్భూమికి బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైతే సరైన మందులు ఇవ్వకపోవడంతో తరగతులకు హాజరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్‌పాండే మాట్లాడుతూ ఇటీవల పాఠశాలను తరలించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, త్వరలో పరి ష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీటీడీఓ ప్రేమలత, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి, స్టాఫ్ ఇన్‌చార్జ్ సమ్మయ్య రాథోడ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment