సాక్షిప్రతినిధి, వరంగల్:
పశుసంవర్థకశాఖలో డిప్యుటేషన్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పదోన్నతులకు ముందు, తర్వాత జరిగిన బదిలీలు.. ఆ వెంటనే కోరుకున్న చోటుకు ఆన్ డిప్యుటేషన్ (ఓడీ)లపై కొందరిని నియమించడం ఆ శాఖలో వివాదాస్పదమైంది. డిప్యుటేషన్ల కారణంగా వివక్షకు గురైన కొందరు పరస్పరం పేరు, ఊరు లేకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ విషయమై ఈ నెల 13న ‘వదలం.. కదలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది. ఈ మేరకు స్పందించిన పశుసంవర్థక శాఖ డైరెక్టర్ గోపి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బదిలీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లపై ఆరా తీసినట్లు తెలిసింది. డిప్యుటేషన్ల వ్యవహారంపై ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నెల 25 వరకు పూర్తి వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల వెటర్నరీ, పశుసంవర్థక అధికారులు, జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారులకు డైరెక్టర్ బి.గోపి పేరిట సర్క్యులర్ జారీ అయ్యింది. ‘డైరెక్టర్/ సంబంధిత జిల్లా కలెక్టర్ల ముందస్తు అనుమతి లేకుండా డీవీఏహెచ్‌ఓలు సొంతగా సరైన ఆదేశాలు లేకుండా చేసింది ఏదైన ఉంటే రాష్ట్రంలోని జిల్లా వెటర్నరీ–పశుసంవర్థక అధికారులు, ఇన్‌చార్జ్‌లు డిప్యుటేషన్ ఉద్యోగులపై వారి నిర్దిష్ట వ్యాఖ్యలతోపాటు వివరణాత్మక నివేదిక సమర్పించాలి. అటువంటి కేసులు ఏవీ లేనట్లయితే నిల్ నివేదిక పంపాలి. అటువంటి (డిప్యుటేషన్) కేసులు తర్వాత గుర్తిస్తే క్రమశిక్షణ చర్యకు బాధ్యత వహిస్తారు’ అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. మొత్తంగా వెటర్నరీ, పశుసంవర్థక శాఖలో ఆన్ డిప్యుటేషన్ల వివాదం హాట్‌టాపిక్‌గా మారింది.
పశుసంవర్థకశాఖలో ఓడీలపై ఆరా
ఈనెల 25 వరకు
సమగ్ర నివేదికకు ఆదేశం
డీఏవీహెచ్‌ఓలకు ఉత్తర్వులు జారీ
Comments
Please login to add a commentAdd a comment