మిలిటరీ వ్యూహాల్లో టెక్నాలజీ కీలకం
కేయూ క్యాంపస్: మిలటరీ వ్యూహాల్లో కంప్యూటర్ టెక్నాలజీ కీలక భూమిక వహిస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నా రు. బుధవారం యూనివర్సిటీలోని కంప్యూటర్ సై న్స్ విభాగం ఆధ్వర్యంలో ఆవిభాగం సెమినార్‌హా ల్‌లో నిర్వహించిన ‘టూ వీక్స్ ఇంటెన్సివ్ ప్రోగ్రాం ఫ్రమ్ ఎక్సెల్ టూ పవర్ బీ ఫర్ ఎన్‌సీసీ జవాన్స్’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలద్వారా ఇంజనీరింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. కంప్యూటర్ సైన్స్ విభా గం అధిపతి రమ మాట్లాడుతూ.. రెండు వారాలపాటు రోజూ ఉదయం రెండు గంటలు థియరీ, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టికల్స్ కృత్రిమమేధా, ఎక్సెల్ పవర్ బీ ఐ డేటా అనాలిసిస్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్‌సీసీ కమాండింగ్ ఆ ఫీసర్ కల్నల్ సింథల్ రామదురై మాట్లాడుతూ.. రెండు వారాల శిక్షణద్వారా సామర్థ్యాల పెంపు, వా ల్యూ అడిషన్ జరగుతుందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేశ్‌లాల్, బీఓఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ మంజుల, డాక్టర్ రమేశ్, డాక్టర్ నీలిమ, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ రవి, సునేహార్ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment