శాతవాహన నగర్‌లో బాలికపై..
ఎల్‌బీనగర్: బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని శాతవాహననగర్ కాలనీలో గురువారం సాయంత్రం కుక్కలు దాడి చేయడంతో లిఖిత అనే బాలిక గాయపడింది. స్థానికులు గమనించి వెంటనే కుక్కలను తరిమివేయడంతో బాలిక ప్రమాదం నుంచి బయట పడింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
● రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
● అత్తాపూర్ తేజస్వీనగర్ కాలనీలో ఘటన
● చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు తరలింపు
రాజేంద్రనగర్: రెండున్నరేళ్ల బాలుడిపై ఆరు వీధి కుక్కలు దాడి చేసి త్రీవంగా గాయపర్చిన ఘటన అత్తాపూర్ తేజస్వీనగర్ కాలనీ సన్‌రైజ్ అపార్ట్‌మెంట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. కోదాడకు చెందిన శేఖర్, మౌనిక దంపతులు. వీరికి ఆరేళ్ల కూతురుతో పాటు రెండున్నరేళ్ల శ్రీహాన్ అలియాస్ సాయిచరణ్ ఉన్నారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి కార్వాన్ ప్రాంతంలో ఉంటున్నారు. కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం తేజస్వీనగర్ సన్‌రైజ్ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం వచ్చారు. కూతురుతో పాటు సాయిచరణ్‌ను పక్కనే కూర్చోపెట్టి పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సాయిచరణ్ ఆడుకుంటూ రోడ్డు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు అతడిపై దాడి చేశాయి. వీపు, చేతులు, తొడ, పిక్కలు, పొట్ట భాగాలను పీకేందుకు ప్రయత్నించాయి. కుక్కలు దాడి చేయడంతో చిన్నారి అరుపులు విన్న అపార్ట్‌మెంట్ వాసులు, రోడ్డుపై వెళ్తున్న వారు, బాలుడి తల్లిదండ్రులు వెంటనే కుక్కలను తరిమివేశారు. గాయపడ్డ చిన్నారిని మొదట స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం నిలోఫర్‌కు పంపించారు.
కుక్కలు.. గుంపులు గుంపులు.. .
అత్తాపూర్ తేజస్వీనగర్ కాలనీలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. కు.ని ఆపరేషన్ చేసి అక్కడే వదిలి వేస్తాం తప్ప ఇతర ప్రాంతాలకు తరలించలేమని వారు చెబుతున్నారని వాపోతున్నారు.
నిమిషం ఆలస్యమైతే.. పీక్కు తినేవి
వీధి కుక్కల గుంపు చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకు వెళ్లా యని స్థానికులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌పై నుంచి తా ము చూసి అరవడంతో పాటు రోడ్డున వెళ్తున్న వారు కుక్కలను తరమడంతో ప్రమాదం తప్పిందన్నారు. నిమిషం లేటైనా బాలుడిని పీక్కు తినేవని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment