బంజారాహిల్స్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఓ మహిళను హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడిన సహాయ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు..ఏపీకి చెందిన మహిళ ( 32) భర్తతో విడిపోయి నగరానికి వలస వచ్చింది. మణికొండలో ఉంటూ హౌస్ కీపింగ్ పని చేసేది. 15 రోజుల క్రితం ఆమె అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్ లో చేరింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేసేందుకు కృష్ణానగర్ ప్రాంతంలో తెలిసిన వారిని వాకబు చేస్తుండగా సినిమాల్లో డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం అతను ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు ఆమెను పిలిపించాడు. మొదటి రోజు ఫొటోషూట్ చేసి మర్నాడు రావాలని చెప్పాడు. రెండో రోజు గదికి వెళ్లగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
● మహిళపై లైంగికదాడి
● సహాయ దర్శకుడిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment