సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నిర్మించతలపెట్టిన ఇండోర్/ అవుట్ డోర్ సబ్‌స్టేషన్ల టెండర్ల కేటాయింపు ప్రక్రియను పాత పద్ధతిలోనే చేపట్టాలని డిస్కం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాస్టర్ ప్లాన్ విభాగం హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో సుమారు రూ.175 కోట్ల అంచనాతో నిర్మించతలపెట్టిన 35 కొత్త సబ్‌స్టేషన్లకు నవంబర్ 28న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. నిజానికి టెండర్ దాఖలు గడువు డిసె ంబర్ 20తో ముగిసింది. టెండర్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గడువును జనవరి 23 వరకు పొడిగించారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచినా బడా కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆశించిన స్పందన లభించక పోవడంతో యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. పాత పద్ధతిలోనే కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. డివిజన్, సర్కిళ్ల వారీగా పనులను విభజించి టెండర్లు పిలవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అనుభవం, ఆసక్తిని బట్టి ఒక్కో కాంట్రాక్టర్‌కు ఒకటి లేదా రెండు సబ్‌స్టేషన్లు అప్పగించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడం ద్వారా పని లో నాణ్యత లభిస్తుందని ప్రభుత్వం ఆశించింది.
పాత పద్ధతిలోనే కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టే యోచన
Comments
Please login to add a commentAdd a comment