4విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్
తుర్కయంజాల్: జన విజ్ఞాన వేదిక, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి పరీక్ష ఆదివారం తుర్కయంజాల్ లార్ట్స్‌హైస్కూల్‌లో నిర్వహించారు. లార్డ్స్ గ్రూప్ స్కూల్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పరీక్ష పేపర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలనే కుతూహలంతో ఉండాలని అన్నారు. ప్రతీ విషయాన్ని పరిశోధించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను జన విజ్ఞాన వేదిక వెలికితీయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతలు అందజేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు రాములయ్య, ప్రధాన కార్యదర్శి కుర్మయ్య, కోశాధికారి సాయిబాబు, సత్యం, ప్రకాష్, చిన్ని కృష్ణ, జహంగీర్, స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment