ఘనంగా అనంత లా కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థులు, పట్టభద్రులంతా సోషల్ ఇంజినీర్స్ అని, సామాజిక భవిష్యత్ అంతా వారిపైనే ఆధారపడి ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా సీనియర్ ప్రొఫెసర్ డా.జీబీ రెడ్డి అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అనంత లా కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టభద్రులకు అనంత రాజమ్మ మెమోరియల్ గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక వ్యవస్థలో న్యాయశాస్త్రం, న్యాయవాదుల ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అనంత లా కాలేజీ కరస్పాండెంట్ రవి అనంత, ప్రిన్సిపాల్ డా.ఎంవీ చంద్రమతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment