సెలబ్రిటీలను మోసగించిన నిందితుడికి రిమాండ్
బంజారాహిల్స్: వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో యువ వ్యాపారవేత్తలను, సినీతారలను మోసగించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..వైజాగ్‌కు చెందిన కాంతి దత్ తోనంగి పలువురు వ్యాపారులచే పెట్టుబడులు పెట్టించి వ్యాపారాలు తెరిపించి పోర్జరీ సంతకాలతో వాటిని తొలగించి కోట్లాది రూపాయలను మోసగించారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లో శ్రీజారెడ్డిని డైరెక్టర్లుగా చెప్పి తృతీయ ఫైన్ జ్యువెలరీ పేరుతో ఓ షాపు తెరిపించాడు. బాలీవుడ్ సినీనటి పరిణీతి చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా పెడుతున్నానంటూ రూ.కోటిన్నర తీసుకుని ఆమెకు ఇవ్వకుండానే మోసగించాడు. పోర్జరీ సంతకంతో శ్రీజారెడ్డిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించాడు. ఇలా చాలామందిని వ్యాపారాలు పెట్టించి..వారిని తొలగించి తానే వాటిని ఆక్రమించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కాంతి దత్‌పై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులో రాజశేఖర్ అనే ర్యాపిడో డ్రైవర్ మృతి చెందగా కాంతిదత్‌పై కేసు నమోదైంది. ఎన్నో కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment