శాంతా వసంత ట్రస్ట్ పురస్కారాల ప్రదానం
సుల్తాన్‌బజార్: భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణ, వికాసానికి కృషి చేస్తేనే అవి పరిపూర్ణంగా భావితరాలకు అందుతాయని వక్తలు అన్నారు. పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని శాంతా వసంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి సినీ గీత కర్త డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని, మనసు ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ మన్నం వెంకటరాయుడికి వెంకట రమణారెడ్డి సాహిత్య సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ వరప్రసాదరెడ్డి ప్రపంచానికి ప్రాణాధారమైన ఔషధాన్ని అందించడమే కాకుండా సాంస్కృతి వైభవాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారన్నారు. డాక్టర్ కేవీ.రమణాచారి మాట్లాడుతూ వరప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులను స్మరించుకునేందుకు వారి పేరుతో సాహితీమూర్తులకు కళాకారులకు క్రమం తప్పకుండా పురస్కారాలు అందించి గౌరవించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, శాంతా వసంత ట్రస్ట్ కార్యదర్శి నవీన్, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment