‘ట్రేడ్’పై గురి!
అలాంటి భవనాలు సర్కిళ్ల వారీగా
సర్కిల్ భవనాలు
కాప్రా 7,853
ఉప్పల్ 5,483
హయత్‌నగర్ 6,773
ఎల్‌బీనగర్ 6,094
సరూర్‌నగర్ 6,893
మలక్‌పేట 6,572
సంతోష్‌నగర్ 3,022
చాంద్రాయణగుట్ట 2,451
చార్మినార్ 1,5313
ఫలక్‌నుమా 5,171
రాజేంద్రనగర్ 5,477
మెహిదీపట్నం 8,492
కార్వాన్ 4,625
గోషామహల్ 3,4137
ముషీరాబాద్ 6,675
అంబర్‌పేట 9,750
ఖైరతాబాద్ 1,4745
జూబ్లీహిల్స్ 9,815
యూసుఫ్‌గూడ 3,209
శేరిలింగంపల్లి 1,7055
చందానగర్ 7,437
ఆర్‌సీపురం, పటాన్‌చెరు 2,390
మూసాపేట్ 7,948
కూకట్‌పల్లి 7,349
కుత్బుల్లాపూర్ 6,653
గాజులరామారం 4,591
అల్వాల్ 4,903
మల్కాజిగిరి 5,549
సికింద్రాబాద్ 2,773
బేగంపేట 20,324
సాక్షి, సిటీబ్యూరో: నెలాఖరు వస్తోందంటే చాలు జీహెచ్‌ఎంసీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సిబ్బంది జీతాల చెల్లింపుల కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. త్వరలోనే డిసెంబర్ నెలతో పాటు సంవత్సరం కూడా ముగియ వస్తుండటంతో సకాలంలో జీతాలు చెల్లించేందుకు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం కమిషనర్ ఇలంబర్తి కన్ను ట్రేడ్ లైసెన్సులపై పడింది. వాస్తవానికి డిసెంబర్ నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వసూలు కావాలి. కానీ, ఇప్పటి వరకు వాటి గురించి సంబంధిత అధికారులెవరూ పెద్దగా పట్టించుకోలేదు.
లైసెన్సులు తీసుకోని వారిపై దృష్టి
ట్రేడ్ లైసెన్సులున్నప్పటికీ ఫీజు చెల్లించని వారితోపాటు అసలు ట్రేడ్ లైసెన్సులే లేకుండా ఎన్నో వ్యాపారాలు నడుస్తుండటం తెలిసిందే. సాధారణంగా నివాస భవనాలకు అనుమతులు పొంది, వాటిని వ్యాపార కార్యకలాపాలకు వినియోగించేవారి గురించి తెలిసిందే. ఇది ఓవైపు పరిస్థితి కాగా.. మరోవైపు వాణిజ్య భవనానికే అనుమతి తీసుకున్నప్పటికీ, ట్రేడ్ లైసెన్సులు తీసుకోనివారు/ఫీజు చెల్లించని వారు భారీగానే ఉన్నట్లు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను జాబితా మేరకు 3,17,033 వాణిజ్య భవనాలుండగా, వాటిలో కేవలం 1,09,702 భవనాల వారు మాత్రమే ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించని వారితోపాటు ట్రేడ్ లైసెన్స్ నంబర్లు ఆస్తిపన్ను నంబర్ (పీటీఐఎన్)తో సరిపోలని భవనాలు కలిపి 2,49,522 ఉన్నట్లు గుర్తించారు. సదరు భవనాలను గుర్తించి ఈ నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయాల్సిందిగా కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిధుల కోసం బల్దియా చర్యలు
ఆదాయ మార్గాలపై కమిషనర్ అన్వేషణ
సిబ్బంది వేతనాల చెల్లింపులకు తంటాలు
ఫీజులు వసూలు చేయాలని ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment