ఉత్తుత్తి గ్యాసేనా?
న్యూ ఇయర్ వేడుకలపై గట్టి నిఘా
కొంత మందికే రూ.500 వంట గ్యాస్
అక్రమంగా మద్యం సరఫరా చేస్తే కేసులు
● డ్రగ్స్ వినియోగదారులపై కఠిన చర్యలు
● ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
అర్హత సాధించినా కొందరికే పరిమితం
● నిబంధనల వర్తింపునకు స్పష్టత కరువు
రాంనగర్‌కు చెందిన గృహిణి ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి , ఇందిరమ్మ.. ఇలా ఇతరత్రా పథకాల వర్తింపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అర్హత సాధించడంతో గృహజ్యోతి కింద విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. కానీ.. రూ.500 వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించలేదు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఆమె భర్త పేరుపై ఉండటంతో ఈ పథకం వర్తించదని ప్రచారం జరగడంతో.. సరిగా ఐదు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తును సవరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో కలెక్టరేట్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మార్పు చేసుకుంది. అయినా.. ఆమెకు ఇప్పటి వరకు రూ. 500 గ్యాస్ పథకం వర్తించని పరిస్థితి నెలకొంది. అయితే.. దీనిపై గ్యాస్ ఏజెన్సీలతో పాటు పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకలపై ఎకై ్సజ్ పోలీసులు నిఘా పెట్టారు. అనుమతి లేని మద్యం, మాంసం సరఫరా, డ్రగ్స్ వినియోగం తదితరాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 30–40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆమోదిత మద్యం మినహా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే న్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలను వినియోగిస్తే నార్కోటిక్స్, డ్రగ్స్, అండ్ సైకోట్రాపక్ (ఎన్‌డీపీఎస్) చట్టం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అనుమతి లేని ప్రాంతాలు, వాణిజ్య స్థలాల్లో మద్యం వినియోగించరాదని తెలిపారు. బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చే ట్రావెల్ బస్సులు, వాహనాలతో పాటు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లలో ఎకై ్సజ్ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. నానాక్‌రాంగూడ, ధూల్‌పేట వంటి ప్రాంతాలపై నిఘా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది గడిచింది. కానీ.. అర్హులందరికీ రూ.500కు వంటగ్యాస్ అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించడం లేదు. బీపీఎల్ కింద ఒకే కుటుంబం గృహజ్యోతి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకానికి మాత్రం అర్హత సాధించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దీంతో పూర్తి స్థాయి బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయక తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంభ మైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరిగా మహాలక్ష్మి పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం కొందరికే వర్తించడంతో పేద కుటుంబాలు నిరాశలో ఉన్నాయి.
ఒక్క శాతం సైతం దాటలేదు..
నగర పరిధిలో వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 31.18 లక్షలు ఉండగా అందులో కేవలం ఒక శాతం కనెక్షన్‌దారులకు మాత్రమే రూ.500 సబ్సిడీ వంటగ్యాస్ వర్తిస్తోంది. సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్ మాత్రం మూడు లక్షలలోపు కనెక్షన్‌దారులు మాత్రమే ఎంపికై నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా సుమారు 16 లక్షల కనెక్షన్‌దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది.
● నగర పరిధిలో సుమారు 52,65,129 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో ప్రజాపాలనలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం 24 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 11 లక్షల కటుంబాలు జీరో బిల్లుకు అర్హత సాధించాయి. మిగతా కుటుంబాలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.
కేంద్రం సబ్సిడీ ఓకే..
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వినియోగదారులకు బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీ కింద రూ. 40.71 జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారు బ్యాంక్ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది.
28న చర్లపల్లి టర్మినల్ ప్రారంభం: ఎంపీ ఈటల
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 28న చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువ కావటంతో చర్లపల్లిలో రైల్వే టర్మినల్ నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్లతో చర్లపల్లిలో గొప్ప రెల్వేస్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కాచిగూడ: వ్యవసాయాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో ‘పొడినేల వ్యవసాయం – సమస్యలు, సవాళ్లు’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గతంలో మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో నీరు లేక భూములు డ్రైల్యాండ్‌గా మారి పంటలు పండక ప్రజలు వలస వెళ్లే వారని అన్నారు. ప్రస్తుతం భూములను సారవంతం చేయడంతో ఆ పరిస్థితిని అధిగమించి పంటలను పండిస్తున్నారని తెలిపారు. మేధావులు, యువత వ్యవసాయ రంగం పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. సదస్సులో తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ముత్యంరెడ్డి, యూఓహెచ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీజిత్ మిశ్రా, సీఈఎస్‌ఎస్ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి, ఐసీఏఆర్ రాయపూర్ జాయింట్ డైరెక్టర్ ఎ.అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో పాల్గొన్న చిన్నారెడ్డి తదితరులు
Comments
Please login to add a commentAdd a comment