న్యాయ నిపుణులతో హైడ్రా కమిషనర్ సమావేశం
బంజారాహిల్స్: చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవానికి కృషి చేస్తున్న హైడ్రాకు తగిన న్యాయ సలహాలు అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు వెల్లడించారు. శనివారం హైడ్రా కార్యాలయంలో ప్రభుత్వ భూములు కాపాడుతున్న సందర్భంగా తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాఽథ్ ఆధ్వర్యంలో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారులు, పార్కులు కబ్జాకు కాకుండా హైడ్రా కాపాడుతోందన్నారు. చెరువులను పునరుద్ధరణ, వరద కాలువలను సజీవంగా ఉంచడంతోనే నగరానికి వరద ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ రేసు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment