తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, క్రైస్తవ మత పెద్దలు, దైవజనులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఆలపించిన భక్తిగీతాలతో ఎల్‌బీ స్టేడియం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment