ఆరంభం.. అట్టహాసం
కడ్తాల్: కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో శనివారం ధ్యాన జనుల సందడి మధ్య పత్రీజీ ధ్యాన మహాయాగం–3 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్, కర్నూలు ఎంపీలు మల్లురవి, నాగరాజు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, దివంగత ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కుమార్తె పరిణిత, ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పత్రీజీ అని, ధ్యానమయ సమాజం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయనీయమని కొనియాడారు. పత్రీజీ చూపిన ధ్యాన మార్గం అనుసరణీయమన్నారు. కర్నూల్ ఎంపీ నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని, ధ్యానంతో తమ జీవితాలను బాగు చేసుకోవాలని సూచించారు.
ప్రారంభమైన పత్రీజీ ధ్యాన మహాయాగ వేడుకలు
జ్యోతి ప్రజ్వలన చేసిన ఎంపీలు మల్లురవి, నాగరాజు
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ధ్యానులు
Comments
Please login to add a commentAdd a comment