రూ.5.25 లక్షలు రీఫండ్
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరస్తుల చేతికి చిక్కి మోసపోయిన రూ.5.25 లక్షల సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేసి, బాధితుడికి అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన వ్యా పారికి సైబర్ నేరస్తులు స్టాక్ ట్రేడింగ్ పేరుతో వల వేశారు. అధిక లాభాలు అందిస్తామని నమ్మించడంతో కేటుగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలకు బాధితుడు రూ.7.25 లక్షల సొమ్మును బదిలీ చేశా డు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో సత్వరమే స్పందించిన పోలీసులు అనధికారిక లావాదేవీలు జరిగాయని బ్యాంక్‌కు సమాచారం అందించి, ఖాతాలోని సొమ్మును ఫ్రీజ్ చేయించారు. సొమ్మును తిరిగి అందజేయాలని కోరుతూ బాధితుడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రూ.5.25 లక్షలు బాధితుడికి అందజేశారు.
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
మరొకరికి గాయాలు
శామీర్‌పేట్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన శీలం దుర్గా ప్రసాద్ (27), నాగవంశీ (25) సిద్దిపేట జిల్లా, కర్కపట్ల గ్రామంలో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బైక్‌పై నగరానికి వెళ్లిన వారు కర్కపట్లకు తిరిగి వస్తుండగా అలియాబాద్ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగవంశీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment