సెల్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్‌చల్
గన్‌ఫౌండ్రీ: ఎల్బీస్టేడియం వద్ద సెల్‌టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్‌చల్ చేశాడు. రోడ్డున పడ్డ మాజీ హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా మాజీ హోంగార్డు వీరాంజనేయులు మాట్లాడుతూ తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహించామని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి ప్రభుత్వం అన్యాయంగా 250 మంది హోంగార్డులను తొలగించిందన్నారు. తమను విధుల్లోకి తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్నో ఏళ్లుగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోనందునే ఈ నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు. తమ సమస్యపై అసెంబ్లీలో చర్చించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మాజీ హోంగార్డుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగి వచ్చాడు.
తొలగించిన 250 మంది హోంగార్డులను
విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment