రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు | - | Sakshi
Sakshi News home page

రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు

Published Sun, Dec 22 2024 10:31 AM | Last Updated on Sun, Dec 22 2024 10:31 AM

-

సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖలో డీటీసీలు, జేటీసీలు గా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

● జాయింట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్లు గా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్ర శేఖర్‌ గౌడ్‌ కు విజిలెన్స్‌, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ఐటీ జాయింట్‌ ట్రాన్‌న్స్‌ పోర్ట్‌ కమిషనర్‌గా, శివలింగయ్యకు అడ్మినిస్ట్రేషన్‌, ప్లానింగ్‌, జాయింట్‌ ట్రాన్‌న్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు.

● డిప్యూటి ట్రాన్‌న్స్‌ పోర్ట్‌ కమిషనర్లులుగా పదోన్నతులు పొందిన రవీందర్‌ కుమార్‌ ను అదిలాబాద్‌ డీటీసీగా, ఎన్‌. వాణిని నల్గొండ డీటీసీగా, అఫ్రీన్‌ సిద్దిఖీని కమిషనర్‌ కార్యాలయంలో డీటీసీగా, కిషన్‌ను మహబూబ్‌ నగర్‌ డీటీసీగా , సదానందంకు రంగారెడ్డి డీటీసీగా పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement