వివాదాస్పదంగా మారిన వేడుకలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రధాన జనరల్ ఆస్పత్రి. నిత్యం 200కు పైగా పేషెంట్స్ వస్తుంటారు. కాగా, ఇందులో పనిచేస్తున్న సిబ్బంది క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారాయి. ఆస్పత్రిలోని ఓ గదిలో స్పీకర్ పెట్టుకుని నృత్యాలు చేయడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై అధికారులకు సమాచారం ఇవ్వగా, పండగ నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని ఆర్‌ఎంవో జవాబివ్వడం గమనార్హం. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆస్పత్రిలో ఇలాంటి వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment