ఘన్‌పూర్ మున్సిపాలిటీకి గెజిట్
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ ప్రజల మున్సిపాలిటీ కల ఎట్టకేలకు నెరవేరుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఘన్‌పూర్ పట్టణ ప్రజలు ఎదురు చూస్తు న్న మున్సిపాలిటీపై గత నెల 20న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే.. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రా మాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం తర్వాత పెద్ద సెంటర్‌గా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కావడానికి నిబంధనల మేరకు అన్ని అర్హతలున్నా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవకాశం దక్కలేదు. ఇదిగో, అదిగో అంటూ కాలం గడిపారు. మున్సిపాలిటీ విషయంలో మొదటి నుంచి పాలకులు, ప్రజాప్రతినిధులు ఘన్‌పూర్‌పై శీతకన్ను వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీ అయిన స్టేషన్‌ఘన్‌పూర్ జనాభా 12వేల పైచిలుకు ఉంది. ఘన్‌పూర్‌కు జంటపట్టణమైన శివునిపల్లి జనాభా ఆరు వేలకు పైగా ఉంది. మున్సిపాలిటీ కావాలంటే నిబంధనల మేరకు 15వేల జనాభా ఉండాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఘన్‌పూర్ జనాభా దాదాపు 16వేలకు పైగా ఉంది. మున్సిపాలిటీ అవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తప్పనిసరి గా మున్సిపాలిటీ అవుతుందనీ.. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి గ్రామ పంచాయతీలను కలిపి చేస్తారని చెప్పినా.. ఆచరణలోకి రాలేదు. కాగా ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో మున్సి పాలిటీ ప్రకటన, గెజిట్ రావడంతో మూడు గ్రామా ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే కడియం కృషితో
ప్రజల కల సాకారం
Comments
Please login to add a commentAdd a comment