జనగామ రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి(రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు) సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులందతా క్షేత్రస్థాయి పరిశీలనలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈనెల 20వ తేదీన వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment