వైభవంగా కనుమ వేడుకలు
హన్మకొండ కల్చరల్ : సంక్రాంతి పండుగలో భాగంగా బుధవారం కనుమ వేడుకలను ప్రజలు ముఖ్యంగా రైతులు వైభవంగా జరుపుకున్నారు. హనుమకొండ వేయిస్తంభాల దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయశాఖ సౌజన్యంతో గోపూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోమాతను పూమాలతో అలంకరించి పచ్చగడ్డి, శనగపిండి, అరటిపండ్లు సమర్పించి హారతి ఇచ్చారు. అంతకు ముందు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన అర్చకులు శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేపూజలు చేశాారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. గోవులు లక్ష్మీస్వరూపమం.. పశువులను దైవంగా పూజించాలని అన్నారు. కార్యక్రమంలో వేదపండితులు గంగు మణికంఠ, అర్చకులు ప్రణవ్, శ్రవణ్, గణపతి, సిబ్బంది పాల్గొన్నారు.
వేయిస్తంభాల ఆలయంలో గోపూజ
Comments
Please login to add a commentAdd a comment