కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించి.. మోతాదుకు మించి మద్యం సేవించిన వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మందు తాగి వాహనాలు నడిపిన 207 మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 93 మంది పోలీసులకు చిక్కారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో చేసిన తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు 27, టూటౌన్ 8 మంది, జడ్చర్లలో 10, కోయిలకొండ 3, హన్వాడ 3, రాజాపూర్ 8, బాలానగర్ 12, మిడ్జిల్ 3, భూత్పూర్ 4, అడ్డాకుల 6, దేవరకద్ర 3, మహబూబ్‌నగర్ రూరల్, వన్‌టౌన్, మూసాపేట, నవాబ్‌పేట, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 14, వనపర్తి టౌన్ 11, కొత్తకోట 7, వనపర్తి రూరల్ 5, గోపాల్‌పేట 4, పెద్దమందడి 4, ఆత్మకూర్ 3, అమరచింత 3, రేవల్లి 2, పాన్‌గల్, ఖిల్లాఘనపురంలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో నారాయణపేటలో 6, దామరగిద్ద 2, ధన్వాడ 2, నర్వ 2, మక్తల్ 4, కృష్ణ 3, మాగనూర్, మరికల్, మద్దూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్‌కర్నూల్ స్టేషన్ పరిధిలో 3, చారకొండలో 2, వెల్దండలో ఒకటి చెప్పున, జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణం 7, ఉండవెల్లి 8, ఇటిక్యాల 3, కొదండాపురం 2,శాంతినగర్ 6, అయిజ 3, అలంపూర్, రాజోళిలో ఒకటి చొప్పున డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, చారకొండ మండలంలో 2, వెల్దండ మండలంలో ఒకరు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment