ఉచిత పంటల బీమా
రైతుపై ప్రీమియం భారం పడకుండా 2019 ఖరీఫ్ నుంచి జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. సాగు చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులు కూడా పరిహారం అందుకోగలిగారు. ఐదేళ్ల పాలనలో ఏటా రూ.1.4 లక్షల చొప్పున జిల్లాలోని 7 లక్షల మంది రైతుల తరఫున బీమా కంపెనీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రీమియం చెల్లించి, రైతులపై నయా పైసా భారం పడకుండా చూసింది. పంట నష్టపోయిన 1,14,011 మంది రైతులకు రూ.217.64 కోట్ల పరిహారం ఇచ్చి అండగా నిలిచింది.
నేడు భారమంతా రైతుల పైనే..
జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి నేటి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. ఫలితంగా ఈ రబీ నుంచి రైతులే ప్రీమియం చెల్లించాలి. ఎకరాకు పంట విలువ రూ.41 వేలలో ప్రీమియంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 0.5 శాతం అంటే రూ.205 చెల్లిస్తే, మిగిలిన 1.5 శాతం మేర రూ.615 రైతులే ప్రీమియంగా చెల్లించాలి. జిల్లాలోని 2.3 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుందనే అంచనా ఉండగా.. పంటల బీమా ప్రీమియం రూపంలో రైతుల నెత్తిన కూటమి ప్రభుత్వం రూ.14.15 కోట్ల భారం మోపింది.
Comments
Please login to add a commentAdd a comment