రైతులకు నిలువునా ముంచేశారు
కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేసింది. ఖరీఫ్‌లో వివిధ పంటలు సాగు చేసిన రైతులం తుపానుతో కొంత నష్టపోతే.. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టించుకోక మరింత కుదేలయ్యాం. తడిసిన ధాన్యాన్ని తేమ శాతం సాకు చూపించి కొనడం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’ పేరిట ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం లేనే లేదు. ఎన్నికల్లో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పాలనకు సంబంధమే లేకుండా పోయింది.
– కేతిన అబ్రహం చౌదరి, రైతు,
ఎన్‌టీ రాజాపురం, గండేపల్లి మండలం
రైతులకు రాయితీలు ఇవ్వలేదు
నాకు సొంతంగా ఎకరం పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇస్తామని, ఇవ్వలేదు. పెట్టుబడి సాయం రూ.20 వేలు అందుతుందని ఆశ పడ్డాం. అయినా చిల్లిగవ్వ కూడా అందలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎక్కువ వానలు పడ్డాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ శాతం పేరుతో కోతలు పెట్టడంతో బస్తాకు రూ.1,500కు మించి గిట్టుబాటు కాలేదు. ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు వ్యవసాయ పనులు మానుకుని ముందుకు వచ్చాను.
– బండే వీరభద్రరావు, రైతు,
వేములవాడ, కరప మండలం
రూ.20 వేల పెట్టుబడి
సాయం ఏమైంది
అధికారంలోకి వస్తే రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తానని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటే చాలా సంతోషించాం. ఆరు నెలలైనా ఇప్పటికీ ఆ ఊసే వినిపించడం లేదు. అసలు ఇది న్యాయమంటారా? మాట ఇచ్చి తప్పుతారా? మాబోటి వాళ్లు ఏమైనా మాట తప్పితే ప్రాణం పోయినంత పనవుతుంది. చివరకు పండించిన పంటకు డబ్బులు ఇవ్వడం కూడా ఆలస్యమవుతోంది. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేయాలనే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చాం.
– జ్యోతుల భీముడు,
మాజీ సొసైటీ అధ్యక్షుడు, గొల్లప్రోలు
హామీలను పెడచెవిన
పెడితే ఎలా?
ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ.20 వేల పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర అందడం లేదు. ఖరీఫ్ సాగుకు పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు దాటింది. నేను నాలుగెకరాలు సాగు చేస్తున్నా. తుపాను వలన దిగుబడి తగ్గిపోతోంది.
– పేకేటి చిన అప్పారావు (చంటి), రైతు,
వాకదారిపేట, తొండంగి మండలం
Comments
Please login to add a commentAdd a comment