కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టారస్ కంపెనీలో బీపీఓ, వరుణ్ మోటార్స్‌లో టీమ్ లీడర్, ఎగ్జిక్యూటివ్ సేల్స్, అడ్వైజర్, పెయింటర్ అండ్ డెంటర్, రిలయన్స్ ట్రెండ్స్‌లో రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇండో ఎంఐఎం, హోండాస్ మోబీస్, పానసోనిక్ అండ్ కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాల కు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment