పైసా విదల్చని కూటమి ప్రభుత్వం
ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రైతులు 2.14 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఆది నుంచీ అధిక వర్షాలు, వరదల రూపంలో ప్రకృతి విపత్తులు రైతులను వెంటాడాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లావ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో నాట్లు, 24 వేల ఎకరాల్లో నారుమడులు దెబ్బ తిన్నాయి. రెండోసారి నాట్లు వేసుకోవాల్సి రావడంతో పెట్టుబడులు రెట్టింపై రైతులు అప్పుల పాలయ్యారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో రూ.4 వేల సాయం అందించింది. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరును ‘అన్నదాతా సుఖీభవ’గా మార్చడం మినహా ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. రైతులు రబీలో అడుగు పెడుతున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆ ఊసే ఎత్తడం లేదు.
నాడు ఆదుకున్నారిలా..
నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సాగు ప్రారంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 జత చేసి ఏటా రూ.13,500 ఖరీఫ్ ప్రారంభం, కోతలు, రబీ ప్రారంభంలో రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. తొలి విడతగా మే నెలలో రూ.7,500, ఖరీఫ్ చివరిలో రూ.4 వేలు, రబీ ప్రారంభంలో రూ.2 వేలు అందజేసి ఆదుకున్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో రైతుభరోసా కింద జిల్లాలోని 1.70 లక్షల మంది రైతులకు రూ.1,121 కోట్ల సాయం అందించి వెన్నుదన్నుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment