‘అన్నదాతా సుఖీభవ’ ఎప్పుడిస్తారో చెప్పండి
జిల్లాలో 80 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. ఇటువంటి జిల్లాలో కూటమి నేతలు ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించారు. వాటిని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం అన్యాయం. రైతులకు భారం కాకుండా ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. ‘అన్నదాతా సుఖీభవ’ కింద సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రూ.20 వేలు ఇంతవరకూ ఇవ్వకపోవడం అన్యాయం. కనీసం ఎప్పుడిస్తారో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోంది.
– కర్నాకుల వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు కూలీ సంఘం
తక్కువ రేటుకే కొన్నారు
తుపాను, వరదలతో ధాన్యాన్ని కళ్లాల్లోనే అమ్మేసుకున్నాం. ప్రభుత్వం చెప్పినట్టు కనీస మద్దతు ధర రూ.1,750 వస్తుందనుకున్నాం. తీరా చూస్తే 75 కేజీల బస్తా రూ.1,400 నుంచి రూ.1,500కే అమ్ముకోవాల్సి వచ్చింది. కనీస మద్దతు ధర గురించి అడిగితే తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చూపించారు. పెట్టుబడి సాయం అందుతుందనుకున్నాను. ఖరీఫ్ సీజన్ ముగిసినా అందలేదు. ఆ సాయం అంది ఉంటే పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. కనీసం రబీ నాటికై నా అన్నదాతా సుఖీభవలో రూ.20 వేలు అందజేసి ఆదుకోవాలి.
– నల్లల గోవిందు, రైతు, కట్టమూరు, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment