రైతులకు వెన్నుదన్నుగా తరలిరండి
కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేసింది. అన్నదాత సుఖీభవ సాయం ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దళారీ వ్యవస్థకు తిరిగి గేట్లు తెరవడంతో ఖరీఫ్ రైతులకు మద్దతు ధర అందడం లేదు. ఎన్నికల హామీలను అమలు చేసి, రైతు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు తరలి రావాలి. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సెంటర్‌కు చేరుకుని, అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకుని, కలెక్టర్‌కు విజ్ఞాపన అందజేస్తాం.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment