‘నన్నయ’లో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు
రాజానగరం: చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ బోర్డు ఇన్‌చార్జి సెక్రటరీ ఆచార్య జి.సుధాకర్ అన్నారు. యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగే ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్‌షిప్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ వంటి మూడు విభాగాల్లో జరిగే 24 ఈవెంట్స్‌కు అనుబంధ కళాశాలల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి నుంచి యూనివర్సిటీ టీమ్‌ని ఎంపిక చేయనున్నారు. మొదటి రోజు జరిగిన పోటీల్లో హాఫ్ మారఽథాన్ పరుగు ఉమెన్ విభాగంలో మొదటి మూడు స్థానాల్లో జి.పావని (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం), ఎస్.సౌమ్యశిరీష (ఏఎస్‌డీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల, కాకినాడ), బి.నాగలక్ష్మిదుర్గ (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం), మెన్ విభాగంలో బి.సురేష్ (ఎస్‌సీఐఎండీ, తణుకు), ఎ.మోహనకృష్ణప్రసాద్ (డీఎన్‌ఆర్ కాలేజ్ భీమవరం), పి.సాయిరామ్ (భీమడోలు కాలేజ్) నిలిచారు. అలాగే డిస్కస్ త్రోలో ఉమెన్ కేటగిరీలో సీహెచ్ శోభారాణి (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం), ఎస్.శ్రీలక్ష్మీలావణ్య (నన్నయ యూనివర్సిటీ), కె.శ్రీదేవి (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. ఐదు వేల మీటర్ల వాకింగ్ రేస్‌లో ఉమెన్ విభాగంలో వి.నాగలక్ష్మి, సీహెచ్ ఝాన్సీ దుర్గ, ఎస్.పుష్పలత, 20 వేల మీటర్ల వాకింగ్ రేస్‌లో మెన్ విభాగంలో బి.జీవన్‌కుమార్, యు.భీమయ్య, ఎన్. హేమసాయిలు పతకాలను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment