రామచంద్రపురం: లాభాల ఆశ చూపి పలువురిని నమ్మించి మోసగించిన వైనంపై రామచంద్రపురం పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. స్థానిక ముచ్చుమిల్లి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద స్వామికన్ను శశికుమార్ నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మత్తాల నవీన్‌కుమార్, ముత్తాల సాయిపల్లవి నివసిస్తున్నారు. వీరు శశికుమార్‌తో పరిచయం పెంచుకున్నారు. ఎంఎన్‌కే ట్రేడింగ్ అడ్వయిజరీ కంపెనీలో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని శశికుమార్‌ను నమ్మించారు. దీంతో అతను రూ.లక్ష పెట్టుబడి పెట్టగా, నెలలోనే రూ. 25 వేల లాభం వచ్చింది. ఇంకా అధిక మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అతనికి చెప్పారు. దీంతో శశికుమార్ మిత్రులు, బంధువులకు తెలిపి వారి నుంచి సొమ్ము తీసుకుని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సాయికుమార్‌తో పాటు 14 మంది కంపెనీ ఉద్యోగులుగా చేరి ఇతరులను ప్రోత్సహించారు. శశికుమార్ రూ.కోటి వరకూ ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన 14 మంది పెద్ద మొత్తంలో పెట్టారు. అయితే నవీన్‌కుమార్, సాయిపల్లవిలు ఆరు నెలలుగా వీరికి వేతనాలు, లాభాలు చెల్లించటం లేదు. డబ్బుల గురించి అడగ్గా 10 రోజుల నుంచి వాయిదా వేస్తున్నారు. ఇటీవల ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు వదిలి పోయినట్లు శశికుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను నమ్మించి మోసగించిన నవీన్‌కుమార్, సాయిపల్లవిలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment