టీడీపీ, జనసేన మధ్య నీటి సంఘాల పంపకం
పిఠాపురం: నీటిసంఘాల ఎన్నికల్లో మీకిన్ని.. మాకిన్ని అంటూ టీడీ పీ, జనసేన నేతలు పంచుకుంటున్నారు. నియోజకవర్గంలో 36 నీటి సంఘాలుండగా.. 16 టీడీపీకి 20 జనసేనకు పంచుకున్నారు. పిఠాపురం మండలం, పట్టణంలో 5 టీడీపీకి, 6 జనసేనకు, కొత్తపల్లి మండలంలో ఇరు పార్టీలకు చెరో 3, గొల్లప్రోలు మండలంలో 8 టీ డీపీకి, 11 జనసేనకు పంచుకున్నారు. అయితే తమతో సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా ఇలా పంచుకోవడమేమిటని రైతులు నిలదీస్తున్నారు. బలం ఉన్న కొందరు పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment