గిరిజనులకు చట్టాలపై అవగాహన పెంచాలి
సామర్లకోట: గిరిజన ప్రాంత పరిపాలనలో పిసా చట్టాలపై అవగాహన కల్పించి వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ) ప్రిన్సిపాల్ జె.వేణుగోపాల్ అఽన్నారు. గిరిజనుల చట్టాలపై అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, ఏలూరు జిల్లాలలోని అధికారులకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మూడు జిల్లాలోని ప్రతీ మండలం నుంచి ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, నలుగురు పంచాయతీ కార్యదర్శులకు ఎంఓటీలుగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పొందిన అధికారులు ఆయా మండలాలల్లో గిరిజనులకు వారి హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారన్నారు. గిరిజనులు శ్రమ దోపిడీకి గురి కాకుండా చూడాలని తెలిపారు. వీరి అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ ఇ.కృష్ణమోహన్, ఏపీఎస్‌ఐఆర్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ డైరెక్టర్ రామనాథం, ఫ్యాకల్టీలు పి.శ్రీనివాసరావు, ప్రసాద్, చక్రపాణిరావు, బి.ఆంజనేయులు, డీఆర్‌ఎన్ పద్మజ కేఆర్ నిహారికలు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ నెల 21, 22 తేదీలలో రెండవ బ్యాచ్ శిక్షణ ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment