కామారెడ్డి క్రైం: నీట్ కోసం సన్నద్ధమవుతున్న యువకుడు.. కోచింగ్‌లో పాఠాలు అర్థం కావడం లేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (19) ఇంటర్ పూర్తి చేసి వైద్య విద్యలో ప్రవేశం నిమిత్తం నీట్ కోసం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన కృష్ణమూర్తి.. ఈనెల 2 న హైదరాబాద్ వెళ్లడానికి కామారెడ్డి బస్టాండ్‌లో ఆగాడు. అక్కడినుంచి స్నేహితుడు రవికి వీడియో కాల్ చేసి తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానని చెప్పాడు.
రవి వెంటనే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అందరూ కలిసి బస్టాండ్‌కు చేరుకుని గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. జూబ్లీ బస్టాండ్‌లోని బస్సులలో వెతకగా ఓ బస్సులో అపస్మారక స్థితిలో కృష్ణమూర్తి కనిపించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. పాఠాలు అర్థం కావడం లేదని బాధపడేవాడని మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment