ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్, వాస్క్యులర్ కేంద్రాలు
రెంజల్(బోధన్): ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు క్యాన్సర్ చికిత్స కేంద్రాలతోపాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్‌లను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. రెంజల్‌లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వార మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా 90 శాతం వరకు ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 213 నూతన అంబులెన్స్‌లను ప్రారంభించినట్లు మరో 80 నుంచి 85 వరకు అవసరం ఉన్నట్లు తెలిపారు. త్వరలో వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు. 102 అమ్మ ఒడి వాహనాలను ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాందీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్, నాయకులు నాగభూషణంరెడ్డి, సాయరెడ్డి, దనుంజయ్, రాములు తదితరులు పాల్గోన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment