ధాన్యం కొనుగోళ్లలో ద్వితీయ స్థానం
కామారెడ్డి క్రైం : జిల్లాలో 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. 424 కేంద్రాల ద్వారా 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది.
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3,14,909 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. రైతుల ఇంటి అవసరాలకుపోను దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేశారు. రెండు నెలల క్రితమే ప్రభుత్వం ధా న్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు ప్రారంభించింది. పంట చేతికి వచ్చే సమయానికి జిల్లా వ్యాప్తంగా 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 87 వేల మంది రైతుల నుంచి 4,37,150 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చే శారు. దీంట్లో 1,00,102 మెట్రిక్ టన్నులు సన్న ర కాలు ఉండగా 3,37,120 మెట్రిక్ టన్నులు దొడ్డు ర కం వడ్లున్నాయి. వాటి విలువ రూ.1,013 కోట్లు. ఇ ప్పటికే దాదాపు రూ. 1000 కోట్లు వరకు చెల్లింపు లు కూడా పూర్తయ్యాయి. సన్న రకాలకు సంబంధించి రూ. 50.40 కోట్లను బోనస్‌గా రైతులకు ఇ వ్వాల్సి ఉండగా ఇప్పటికే రూ.50.30 కోట్లను రైతు ల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో 4.37 లక్షల మెట్రిక్
టన్నుల వడ్ల సేకరణ
అగ్రస్థానంలో నిజామాబాద్ జిల్లా
ముగిసిన ధాన్యం సేకరణ ప్రక్రియ
కొనుగోళ్లు పూర్తయ్యాయి
ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యింది. దాదాపు 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు చెల్లింపులు సైతం దాదాపుగా పూర్తయినట్లే. బోనస్ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేశాం. – రాజేందర్, డీఎం, జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment