ప్రశాంతంగా నవోదయ పరీక్షలు
బిచ్కుంద/బాన్సువాడ/ఎల్లారెడ్డి/దోమకొండ: జిల్లాలోని పలు మండలాల్లో శనివారం నిర్వహించిన నవోదయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బిచ్కుండలోని పరీక్ష కేంద్రంలో 620 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 420 మంది విద్యార్ధులు పరీక్ష రాశారని ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఉండగా మొత్తం 641 మంది విద్యార్థులకు గాను 520 మంది విద్యార్థులు హాజరయ్యారు. దోమకొండలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 387మంది రావాల్సి ఉండగా 210 మంది హాజరైనట్లు ఎంఈవో విజయ్‌కుమార్ తెలిపారు. ఎల్లారెడ్డిలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 467మందికి 324 మంది హాజరైనట్లు ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్లు మాణిక్యం రాజులు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను స్థానిక అధికారులు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment