గ్రామ సభలకు వేళాయె!
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం రైతు ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుడుతోంది. దీనికి ఉపాధి హామీని ప్రామాణికంగా తీసుకుంది. గతేడాది కనీసం 20 రోజులు ఉపాధి హామీలో పనిచేసిన కుటుంబాల లెక్కలు తీసింది. జిల్లాలో 1.70 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. 60 వేల జాబ్ కార్డులపై ఇరవై రోజులపైన పని చేసినట్టు గుర్తించారు. అందులో నిబంధనల ప్రకారం భూమి లేని కూలీల వివరాలు తీసుకున్నారు. జిల్లాలో 15,501 మంది కూలీలకు రైతు ఆత్మీయ భరోసా అందనుంది.
● నేటి నుంచి గ్రామ/వార్డు సభలు
● నాలుగు పథకాల లబ్ధిదారుల
జాబితాల ప్రదర్శన
● సభలో చర్చించాకే
ఆమోదముద్ర
● దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారంనుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆయా సభల్లో జాబితాలను ప్రదర్శించి చర్చించనున్నారు. సభ ఆమోదం తర్వాత ఈనెల 26నుంచి ఆయా సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి. కాగా లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
రైతుభరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే అర్హులను ఎంపిక చేసేందుకు బల్దియాలు, గ్రామాలలో సర్వే నిర్వహించింది. సర్వే వివరాలను క్రోడీకరించి, అర్హులకు సంబంధించిన ముసాయిదా జాబితాను రూపొందించింది. ఈ జాబితాలపై చర్చించి ఆమోదించేందుకు గ్రామ/వార్డు సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 21 నుంచి 24 వరకు సభలు కొనసాగనున్నాయి. జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 80 వార్డులలో సభలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజూ 130 నుంచి 140 గ్రామసభలు, అలాగే మున్సిపాలిటీల్లో రోజుకు ఇరవై సభలు జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. సర్వేల ఆధారంగా రూపొందించిన లబ్ధిదారుల జాబితాలను సభల్లో ప్రదర్శించి, అభ్యంతరాలు, ఆక్షేపణలు వస్తే చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆహార భద్రత కార్డులకోసం..
జిల్లాలో రేషన్ కార్డుల కోసం 21,842 దరఖాస్తులు రాగా.. ఇటీవల సర్వేలో వాటిని పరిశీలించారు. అందులో అర్హులను గుర్తించి కార్డులు జారీ చేయనున్నారు. అలాగే గతంలో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం కోసం 60,472 దరఖాస్తులు వచ్చాయి. అయితే కొత్త కార్డుల కోసం వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించింది.
ఇందిరమ్మ ఇళ్లు..
రైతు భరోసా..
ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలో ఆ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హుల జాబితాలను రూపొందించారు. ఎంత మంది అర్హులనేది ఇంకా వెల్లడించలేదు. అయితే ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో తొలి విడతలో 3,500 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున లబ్ధిదారుల జాబితాలో ఎవరి పేరుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
జిల్లా లో 5.24 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇందులో సాగుకు యోగ్యం కాని భూములు 7 వేల ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అవి పోను మిగతా భూములకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఎకరాకు పంటకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment