గ్రామసభలపై విస్తృతంగా ప్రచారం చేయాలి
కామారెడ్డి క్రైం: సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మంగళవారంనుంచి నిర్వహించే గ్రామ, వార్డు సభలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై మంగళవారంనుంచి 24వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 535 గ్రామాలు, 80 మున్సిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం సభలు నిర్వహించాలన్నారు. అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సభల్లో వివరించి, అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులపై చర్చించాలన్నారు. ప్రతి పథకానికి సంబంధించి ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశాల్లో కొత్తగా వచ్చిన దరఖా స్తులను స్వీకరించి, తర్వాత విచారణ చేస్తామని దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని ప్రజలకు వివరించాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, అంగన్‌వాడీ టీచర్లకు సహాయకులుగా విధులు అప్పగించాలని సూచించారు. గ్రామ సభల అనంతరం రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, జెడ్పీ సీఈవో చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రుసుము లేకుండా బంకమట్టి..
కామారెడ్డి టౌన్: కుమ్మరి శాలివాహన కుటుంబాలు ఎలాంటి రుసుము చెల్లించకుండా చెరువుల నుంచి బంక మట్టిని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. కాలుష్య నివారణలో భాగంగా ప్రభుత్వం మట్టి సీసాలు, కప్పుల తయారీని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఇంధనానికి ఉపయోగించే మొక్కల పెంపకం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడానికి అనుమతించిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి స్రవంతి, ఆర్డీవో రంగనాథ్‌రావు, జెడ్పీ సీఈవో చందర్, అధికారులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించాలి
గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం సభలు నిర్వహించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment