ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలి

Published Sat, Sep 21 2024 2:00 AM | Last Updated on Sat, Sep 21 2024 2:00 AM

ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలి

కరీంనగర్‌: విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు మాట్లాడుతూ నగరంలోని బ్రాహ్మణ వీధిలో గల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటన జరగకుండా, ఉపాధ్యాయుడికి వత్తాసు పలుకుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బామండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలతాడెం మధు, హాస్టల్స్‌ ఇన్‌చార్జి అన్నాడి శ్రీవర్ధన్‌, నగర సంయుక్త కార్యదర్శులు విగ్నేష్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement