గోదావరిఖని: సింగరేణి సంస్థ చరిత్రలోనే ఈఆర్థిక సంవత్సరం అత్యధిక లాభాలు ఆర్జించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా.. రూ.2,388.50 కోట్ల వాస్తవ లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. గతేడాదితో పోల్చితే ఇవి రూ.77.20కోట్లు అధికమని వెల్లడించింది. అయితే, గతంలో కన్నా ఈసారి ఒకశాతం పెంచి 33 శాతం కార్మికుల వాటాగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఐదు నెలలు ముగిశాక..
ఆర్థిక సంవత్సరం ముగిసిన ఐదునెలల తర్వాత సింగరేణి వార్షిక లాభాలను ప్రకటించింది. 70 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. గతేడాదికన్నా ఈసారి బొగ్గు ఉత్పత్తితో పాటు టర్నోవర్ పెరగడంతో లాభాలు కూడా పెరిగాయి. తద్వారా ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల – రూ.2.50లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని యాజమాన్యం చెబుతోంది.
లాభాల్లో 33 శాతం వాటా
సింగరేణి ఏటా సాధించే లాభాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తోంది. ఈసారి వార్షిక లాభాలు రూ.2,388.20కోట్లుగా ప్రకటించింది. ఇందులో కార్మికుల వాటాగా 33శాతం చెల్లించనున్నట్లు సీఎం వెల్లడించారు. 10శాతంతో ప్రారంభమైన కార్మికుల లాభాల వాటా ప్రస్తుతం 33 శాతానికి చేరుకుంది.
కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల బోనస్
సింగరేణి చరిత్రలో తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కార్మికునికి రూ.5వేల బోనస్‌గా.. సుమారు రూ.30కోట్లు చెల్లించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. అలాగే వరద బాధితుల సాయం కోసం గురువారం చెల్లించిన రూ.10.20కోట్లు సంస్థ సాధించిన లాభాల్లోనివేనని వెల్లడించారు.
తొమ్మిదేళ్లలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు, కార్మికుల వాటా, చెల్లింపులు(రూ.కోట్లలో)
చరిత్రలో అత్యధిక లాభాలు సాధించిన సింగరేణి
ఒక్కో కార్మికునికి రూ.1.90 – రూ.2.50లక్షలు వచ్చే అవకాశం
33 శాతం వాటాగా రూ.788.20కోట్ల చెల్లింపు
తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల బోనస్
ఆర్థికసంవత్సరం లాభాలు కార్మికుల వాటా చెల్లింపులు చెల్లించిన తేదీ
2015–16 1,066.13 23 245.20 07–10–16
2016–17 395.38 25 98.84 29–09–17
2017–18 1,212.75 27 327.27 29–08–18
2018–19 1,766.00 28 493.00 04–10–19
2019–20 993.00 28 278.04 14–10–20
2020–21 272.20 29 79.06 11–10–21
2021–22 1,227.00 30 368.00 10–10–22
2022–23 2,222.00 32 711.00 22–10–23
2023–24 2,388.50 33 788.20 20–09–24
Comments
Please login to add a commentAdd a comment