ఎంతకై నా తెగిస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ఎంతకై నా తెగిస్తున్నారు..

Published Sat, Nov 9 2024 12:38 AM | Last Updated on Sat, Nov 9 2024 12:38 AM

ఎంతకై నా తెగిస్తున్నారు..

ఎంతకై నా తెగిస్తున్నారు..

గోదావరిఖని: కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఎంతకై నా తెగిస్తున్నారు. మరికొందరు మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియడంలేదు. ఇంకొందరు అడ్డువచ్చిన వారిని హతమార్చుతున్నారు. మత్తులో డ్రైవింగ్‌ చేస్తున్నవారు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువు చాలిస్తూ తల్లిదండ్రులకు పుత్రశోకం మిగుల్చుతున్నారు. కొద్దిరోజులుగా కోల్‌బెల్ట్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

రోడ్డు, రైలు మార్గాల ద్వారా..

రోడ్డు, రైలు, నదీ మార్గాల ద్వారా గంజాయి కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి తరివస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా వస్తోంది. స్మగ్లర్లు తొలుత గంజాయి వినియోగాన్ని పోత్సహిస్తున్నారు. ఆ మత్తులో తూగుతున్న యువతను ఎంపిక చేసుకుని వారి ద్వారా విక్రయాలు ప్రారంభిస్తున్నారు. వ్యాపారం ద్వారా మత్తులో జోగుతుండ డం, ఆర్థికంగా వెసులుబాటు లభించడంతో చాలామంది యువకులు విక్రయాల వైపు మొగ్గు చూ పుతున్నారు. ఎన్టీపీసీ, రామగుండం, గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీతోపాటు రామగుండం పోలీసు కమిషనరేట్‌ ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇంటర్‌ విద్యార్థులు లక్ష్యంగా వ్యాపారం విస్తరిస్తున్నారు.

అనేక రూపాల్లో..

జిల్లాలో గంజాయి వివిధ రూపాల్లో లభిస్తోంది. ప్రధానంగా చాకెట్లు, హాష్‌ ఆయిల్‌, ఆకు, పౌడర్‌ రూపాల్లో తయారు చూస్తూ విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే అధిక మత్తు కోసం యువత గంజాయి వినియోగానికి ఎగబడుతోంది. దీనికి బానిసలైన విద్యార్థులు చదువుకు దూరమై నేరాలకు పాల్పడుతున్నారు. తమ బంగారు జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. సకాలంలో గంజాయి లభించక కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా గోదారిఖనిలో చోటుచేసుకున్నాయి.

అరకులోయ నుంచి..

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం అరకు లోయ తదితర ప్రాంతాల నుంచి కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతోందని తెలిసింది. అలాగే మహారాష్ట్ర, మారుమూల ప్రాంతాల నుంచి కూడా పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నదీ మార్గం ద్వారా దట్టమైన డండకారణ్యం సీలేరు నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడకు చేరుకుంటోంది.

పోలీసుల నిఘా నుంచి తప్పించుకుని..

గంజాయి విక్రయాలపై పోలీస్‌శాఖ సీరియస్‌గా ముందుకు సాగుతోంది. రవాణా, వినియోగంపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఈక్రమంలో ప్రత్యేక డాగ్‌స్క్వాడ్‌కు శిక్షణ ఇచ్చి గంజాయి మూలాలను కనిపెట్టే పనిలో ఉంది. ప్రతీ తనిఖీలో గంజాయిని పసిగట్టే డాగ్‌స్క్వాడ్స్‌ను వినియోగిస్తోంది. అయినా గంజాయి రవాణా, విక్రయం, వినియోగం ఆగడం లేదు.

చైతన్యంతోనే..

యువకుల జీవితాలను ఛిద్రం చేస్తున్న గంజాయిని నిర్మూలించడం చైతన్యంతోనే సాధ్యమని పోలీసులు అంటున్నారు. కాలేజీ స్థాయి నుంచే గంజాయి ప్రభావం పడుతోంది. వారిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు తరచూ ఊకౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పలు కాలేజీలు, పాడుబడిన ప్రాంతాలు, పట్టణ శివారులు అడ్డాలుగా మారడంతో పోలీసులు తరచూ తనిఖీలు చేస్తున్నారు. అయినా, దందా ఆగడంలేదు.

పోలీసులు పట్టుకున్న గంజాయి సమాచారం

గంజాయి మత్తులో జోగుతున్న యువత గొడవలు, హత్యలకూ వెనకాడడం లేదు

మత్తులో డ్రైవింగ్‌ ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వైనం

ఇటీవల ఓ యువకుడు

గంజాయి మత్తులో గోదావరిఖనిలో చోరీకి పాల్పడ్డాడు. ఎదురు తిరిగి వారిపైనే దాడికి తెగబడ్డాడు. అంతేకాదు.. అరెస్ట్‌ చేసిన పోలీసులనూ అంతుచూస్తానని బెదిరించాడు. అడ్డువచ్చిన వారిని గాయపర్చాడు.

తన భార్యను తనకు కాకుండా

చేశాడనే కారణంతో ఓ యువకుడు

గంజాయి మత్తులో మరో వ్యక్తిని దారుణంగా చంపాడు. ఈ ఘటన ‘ఖని’ పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం కలిగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement