సాయి సేవా సమితి..
జ్యోతినగర్(రామగుండం): సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం, విద్యార్థులకు ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు అందించడం, మహిళలకు ఉపాధి శిక్షణ, క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీపీసీ ఆస్పత్రిలో సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న పోతారం రాందాసు 1999 అక్టోబర్ 19న ఈ సమితిని ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ప్రకాశ్‌రావు చేతులమీదుగా మేడిపల్లి సెంటర్‌లోని ఎన్టీపీసీ సంస్థకు చెందిన క్వార్టర్‌లో ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉంద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతీ గురు, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తున్నారు.
సమాజ సేవ కోసమే ఆవిర్భావం
సమాజ సేవ కోసమే సాయి సేవా సమితి ఆవిర్భవించింది. ఉచిత పాఠశాల నిర్వహణతో పాటు ఆస్పత్రి, నారాయణ సేవలో ప్రతీ గురు, ఆదివా రాల్లో పేదలకు భోజనం పెడుతున్నాం.
– అశోక్‌రెడ్డి, కార్యదర్శి, సాయి సేవా సమితి
Comments
Please login to add a commentAdd a comment