ఫంక్షన్లలో మిగిలిన ఆహారం సేకరణ
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ పాతబజార్‌లో విన్నర్ హెయిర్ స్టైల్ షాపు నిర్వహిస్తున్న ఒల్లోజు శ్రీనివాస్ నిరుపేద. చేసేది కులవత్తి.. అయినా, ఆకలి విలువ తెలిసి, పేద ల ఆకలి తీర్చడంలో ముందుంటున్నాడు. 2012లో తన పాత ద్విచక్రవాహనంపై పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించడం ప్రారంభించాడు. అనాథ ఆశ్రమాల్లో, నిరుపేదలకు, భిక్షాటన చేసేవారి ఆకలి తీరుస్తున్నాడు. 2015లో కుటుంబ అవసరాల కోసం ఆటో కొనుగోలు చేసి, ఇప్పుడు అందులోనే కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాలు, ఫంక్షన్‌హాళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు తీసుకువస్తున్నాడు. ప్రతీచోట తన ఫోన్ నంబర్ 98487 18196 రాయించాడు. అన్నం మిగిలిందని ఫోన్ చేస్తే చాలు వెంటనే వాలిపోతాడు. ఎంతో మంది పేదలు తిండి లేక అల్లాడుతున్నారని, ఆహారాన్ని నేల, చెత్తకుండీల పాలు చేయొద్దని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment