విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
కరీంనగర్: బాసర ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి బామండ్ల నందు మాట్లాడుతూ బాసర ఐఐఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని నిరసన తెలియజేసేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించడంతో సాయికుమార్ అనే కార్యకర్తకు గాయాలై ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని అన్నారు. దాడులకు పాల్పడిన సెక్యూరిటీ ఏజెన్సీని విధుల నుంచి తొలగించాలని తెలిపారు. సీఎస్‌వో రాకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేలాది మంది విద్యార్థులతో ఐఐఐటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జి యోగేశ్, నగర సంయుక్త కార్యదర్శి విఘ్నేశ్, నాయకులు అనిల్, హర్షిత్, హరీశ్, రంజిత్, అజయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment