రెప్పపాటులో ప్రమాదం
బోయినపల్లి(చొప్పదండి): కొత్త సంవత్సరం వేళ వేములవాడ రాజన్న దర్శనా నికి వెళ్తున్న వాహనం బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా, 19 మంది గాయపడ్డారు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వెలుగూర్‌కు చెందిన 27 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అలుగునూర్‌కు వచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి టాటా ఏస్ గూడ్స్ వాహనంలో బుధవారం 20 మంది బయలుదేరారు. బోయినపల్లి మండలం కొదురుపాక జంక్షన్ సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కాంత, కవిత, సమంతబాన్, లక్ష్మి, సూర్య, రాజు, అంబేడ్కర్, రేఖ, కవిత, సుష్మ, ఛాయ, వసంత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కాంతను కరీంనగర్ తరలించగా మృతిచెందగా, కవిత, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. గంగుభాయి, విమల, మమత, సుధాకర్, తానాజీ, బిక్కు, శంకర్, వనిత గాయపడ్డారు. వీరిని 108 వాహనాలలో మొదట వేములవాడకు, అక్కడి నుంచి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ 35 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య వారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. డ్రైవర్ మహేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృధ్వీధర్ తెలిపారు.
ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
సిరిసిల్ల ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుండగా వాహనం బోల్తా
Comments
Please login to add a commentAdd a comment