ఆగివున్న లారీని ఢీకొన్న బైక్
● కొండగట్టు ఆలయ ఉద్యోగికి తీవ్ర గాయాలు
మల్యాల(చొప్పదండి): రోడ్డు పక్కన ఆగివున్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో కొండగట్టు ఆలయ ఉద్యోగి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కొండగట్టు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న గుండేటి రాజేందర్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై విధులకు వెళ్తున్నాడు. మల్యాల అడ్డరోడ్డు సమీపంలో జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సురేశ్ సంఘటన స్థలానికి చేరుకొని, బాధితుడిని 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆలయంలో చోరీ
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణంలోని శ్రీశివభక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఉమ్మెంతుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గత మంగళవారం రాత్రి 10.30 గంటల వరకు భక్తులు ఆలయంలో భజన చేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 6 గంటలకు వచ్చిన పూజారికి తాళం పగిలి కనిపించడంతో వెంటనే చైర్మన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి, పరిశీలించి, పంచలోహ హన్‌మాన్ విగ్రహం, ఇత్తడి తాంబూలం, ఇత్తడి గోముఖాలు, ఆంప్లిఫయర్‌తోపాటు హుండీలోని డబ్బులు చోరీ అయ్యాయని పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment