10న పద్మనగర్ మార్కెట్ ప్రారంభం
కరీంనగర్ కార్పొరేషన్: పద్మనగర్ సమీకృత మార్కెట్‌ను జనవరి 10వ తేదీన ప్రారంభిస్తున్నట్లు మేయర్ వై.సునీల్‌రావు తెలిపారు. స్మార్ట్‌సిటీలో భాగంగా 16వ డివిజన్ పద్మనగర్‌లో రూ.16.50ఓట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను శనివారం నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారపదార్థాలు అన్ని ఒకే చోట లభించేలా నగరంలోని నాలుగు వైపులా నాలుగు సమీకృత మార్కెట్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప నులు చివరిదశలో ఉన్నాయని, అవి కూడా పూర్తి చేసుకొని జనవరి 10వ తేదీన ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. మార్కెట్లో 193మంది వ్యాపారులు అమ్మకాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కిరాణ సామగ్రి విక్రయించుకొనేందుకు 22 షట్టర్లు నిర్మించామన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో 42 పనులకు గాను 25 పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మిగతా 17 పనుల్లో రెండు పనులు టెండర్ దశలో ఉండగా, మిగిలిన 15 పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేశ్, ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
10న స్టాల్స్ కేటాయింపు
పద్మనగర్ మార్కెట్ స్టాల్స్‌ను జనవరి 10వ తేదీ న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల కాలపరిమితికి నగరపాలకసంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో లాటరీ ద్వారా ఎంపిక చేసి కేటాయిస్తామన్నారు. 138 వెజ్, 31 నాన్‌వెజ్, 2ఫిష్‌స్టాళ్లు, 22 షట్టర్లు రిజర్వేషన్ ప్రకారం కేటాయించనున్నామని వెల్లడించారు. ఈ లాటరీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వ్యాపారులు తమ వివరాలతో రూ.500 దరావతు(తిరిగి ఇవ్వబడని)తో నగరపాలకసంస్థ కార్యాయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment